అమెరికాలో నల్గొండ జిల్లా యువకుడు మృతి

అమెరికాలో నల్గొండ జిల్లా యువకుడు మృతి

అమెరికాలో నల్లగొండ జిల్లాకు చెందిన మండలి శేఖర్‌ (28) యువకుడు మృతి చెందాడు. జిల్లాలోని గుర్రంపోడు మండలం తీర్థపల్లి గ్రామానికి చెందిన శేఖర్‌ రెండేండ్ల క్రితం ఉపాధి కోసం అమెరికా వెళ్లాడు. అయితే నవంబర్‌ 19న ఇల్లికాట్‌ పట్టణంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. శేఖర్‌ మృతి వార్త తెలుసుకున్న అతని తల్లిదండ్రులు బోరున విలిపించారు. తీర్థపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

 

Tags :