నంద‌మూరి బాల‌కృష్ణ‌ కు క‌రోనా నెగటివ్ రిపోర్ట్! త్వరలో NBK #107 షెడ్యూల్ స్టార్ట్

నంద‌మూరి బాల‌కృష్ణ‌ కు క‌రోనా నెగటివ్ రిపోర్ట్! త్వరలో NBK #107 షెడ్యూల్ స్టార్ట్

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ కోవిడ్ నుంచి కోలుకున్నారు. రీసెంట్‌గా బాల‌కృష్ణకు క‌రోనా పాజిటివ్ వచ్చింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే అధికారికంగా ప్ర‌క‌టించారు. డాక్ట‌ర్స్ స‌ల‌హాలు తీసుకుంటూ ఆయ‌న హోం ఐసోలేష‌న్ ఉన్నారు. రీసెంట్‌గా జ‌రిపిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ రావ‌టంతో బాల‌కృష్ణ కోలుకున్నార‌ని డాక్ట‌ర్స్ తెలిపారు. ఈ వారం ఆయ‌న రెస్ట్‌లో ఉండి.. వ‌చ్చే వారం నుంచి NBK #107 షూటింగ్‌లో పాల్గొంటార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో  గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. బాలకృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన చిన్ర ప్రోమోను యూనిట్ విడుద‌ల చేసింది.

రాయ‌లసీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను రూపొందిస్తున్నార‌ని స‌ద‌రు ప్రోమో చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. శృతి హాస‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాలయ్య ఇందులో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుద‌ల చేసేలా మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి అన్న‌గారు అనే టైటిల్ ప‌రిశీన‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.మ‌రో వైపు NBK #108 కోసం ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడిక‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. ఆ సినిమా సెప్టెంబ‌ర్ నుంచి మొద‌లు కానుంది. గత ఏడాది బాల‌కృష్ణ అఖండ  అనే సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఏకంగా రెండు వంద‌ల కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఆ సినిమాతో బాల‌కృష్ణ‌.. క్రాక్  వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూవీ కావ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.

 

Tags :