ప్రేక్షకుడు థియేటర్ కి రాడు అన్నదాంట్లో ఏ మాత్రం నిజం లేదు : కళ్యాణ్ రామ్

ప్రేక్షకుడు థియేటర్ కి రాడు అన్నదాంట్లో ఏ మాత్రం నిజం లేదు : కళ్యాణ్ రామ్

సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో యాక్ష‌న్‌కి ప్రాధాన్యం వున్న చిత్రం కళ్యాణ్ రామ్ `బింబిసార‌`.  ఈ చిత్రం కూడా పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. యాక్ష‌న్‌, సోషియో ఫాంట‌సీ లాంటి జోన‌ర్ల‌కు అన్ని చోట్లా ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకే ఆ త‌ర‌హా సినిమాలు భాష‌తో సంబంధం లేకుండా అన్ని చోట్లా విడుద‌ల అవుతున్నాయి. `బింబిసార‌` కూడా ద‌క్షిణాది అంత‌టా ఒకేసారి విడుద‌ల చేయాల‌నుకొన్నారు. ఎప్పుడూ కొత్తతరం దర్శకులను పరిచయం చేసే  క‌ల్యాణ్ రామ్ గతంలో సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి ని  తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు. ప్రస్తుతం వశిష్ఠను ఈ చిత్రంతో పరిచయం చేస్తూ న‌టిస్తూ, నిర్మించిన సినిమా ఇది. సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో యాక్ష‌న్‌కి ప్రాధాన్యం ఉంది.

టైమ్ ట్రావెల్ క‌థ కావ‌డంతో… మిగిలిన భాష‌ల్లోనూ చూస్తార‌న్న ధీమా ఏర్ప‌డింది. అందుకే సౌత్‌లోని మిగిలిన భాష‌ల్లోనూ ఈ సినిమా విడుద‌ల చేయాల‌నుకొన్నారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణ‌యం మారింది. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో మాత్ర‌మే విడుద‌ల చేస్తున్నారు. ఇక్క‌డొచ్చిన ఫ‌లితాన్ని బ‌ట్టి, అప్పుడు మిగిలిన భాష‌ల్లో డ‌బ్ చేస్తారు. ఈ విష‌యాన్ని క‌ల్యాణ్ రామ్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ”బింబిసార ఇప్పుడు తెలుగులో మాత్ర‌మే విడుద‌ల అవుతోంది. మా సినిమాకి తెలుగులో జ‌రిగిన బిజినెస్ ప‌రంగా సంతృప్తిగా ఉన్నాం. తెలుగులో రిజ‌ల్ట్ ని బ‌ట్టి, మిగిలిన భాష‌ల్లో మెల్ల‌గా విడుద‌ల చేస్తాం” అని క‌ల్యాణ్ రామ్ చెప్పారు. ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌ని, అయితే… మంచి క‌థ వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే అది సాధ్యం అవుతుంద‌ని క‌ల్యాణ్ రామ్ చెబుతున్నాడు.

ఓ టి టి ప్రభావంతో  ప్రేక్షకుడు థియేటర్ కి రాడు అన్నదాంట్లో ఏ మాత్రం నిజం లేదు. కేవలం థియేటర్లలో చూడగలిగే సరికొత్త కాన్సెప్టుతో సినిమాలు తీస్తే తప్పక ఆదరిస్తాడు. మన తెలుగు సినిమా మేజర్, గాని కమలహాసన్ గారి విక్రమ్ గాని ఎందుకు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసారు? సినిమా మేకింగ్ పరంగా విజువల్ గా మంచి అనుభూతి నిచ్చింది. అన్నారు. ”ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత మ‌ల్టీస్టార‌ర్ సినిమా అంటే ఓ బెంచ్ మార్క్ ఏర్ప‌డింది. అంత బ‌ల‌మైన క‌థ ఉన్న‌ప్పుడు మాత్ర‌మే మ‌ల్టీస్టార‌ర్ గురించి ఆలోచించాలి” అన్నాడు క‌ల్యాణ్ రామ్.

 

Tags :