న‌వంబ‌ర్ 29న ‘బింబిసార‌’ టీజ‌ర్ : అప్‌డేట్ ఇచ్చేసిన క‌ళ్యాణ్ రామ్‌

న‌వంబ‌ర్ 29న ‘బింబిసార‌’ టీజ‌ర్ : అప్‌డేట్ ఇచ్చేసిన క‌ళ్యాణ్ రామ్‌

నందమూరి కళ్యాణ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’. ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 29న విడుదల చేయబోతున్నట్లు హీరో, నిర్మాత కళ్యాణ్ రామ్ తెలిపారు. నందమూరి కళ్యాణ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’ . ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. మైథిలాజికల్ టచ్‌తో సాగే ‘బింబిసార’ సినిమా టీజర్‌ను న‌వంబ‌ర్ 29న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌, హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్రోమో ద్వారా ప్ర‌క‌టించారు. ద‌య‌లేనివాడు, క్రూరుడైన రాజు బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శ‌త్రు సైనికుల‌ను చంపి వారి శ‌వాల‌పై ఠీవిగా కూర్చున్న క‌ళ్యాణ్ రామ్ లుక్ ఆక‌ట్టుకుంటోంది.

తొలిసారిగా క‌ళ్యాణ్ రామ్ ఇలాంటి డిఫరెంట్ పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో పాటు, ఆ పాత్ర లుక్‌, బ్యాక్ డ్రాప్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో క్యాథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్‌, వ‌రీనా హుస్సేన్ కథానాయికలుగా న‌టిస్తున్నారు. కోవిడ్ రెండు సార్లు ప్ర‌భావం చూప‌డం, గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉన్న చిత్రం కావ‌డంతో సినిమా మేకింగ్ ఆల‌స్య‌మైంది. ఇప్పుడు సినిమా నిర్మాణానంత కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు బింబిసార చిత్రాన్ని క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 24న విడుద‌ల చేయ‌బోతున్నారట‌. ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ్‌, చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. గ‌త ఏడాది సంక్రాంతికి ఎంత మంచివాడ‌వురా సినిమాతో క‌ళ్యాణ్ రామ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు.

త‌ర్వాత క‌రోనా కార‌ణంగా త‌న‌ సినిమాలేవీ పూర్తి కాక‌పోవ‌డంతో క‌ళ్యాణ్ రామ్ థియేట‌ర్స్‌లో సంద‌డి చేయలేదు. మ‌రి కెరీర్‌లో తొలిసారి ఓ హిస్టారిక‌ల్‌, పీరియాడిక‌ల్ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ క‌నిపించ‌బోతున్నాడు. మరి ఈ పాత్ర నిడివి ఎంత? దీంతో పాటు బింబిసార మూవీ మూడు భాగాలుగా రానుందనే వార్తలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ విష‌యాల‌పై తెలుసుకోవాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ఇది కాకుండా డెవిల్ అనే పీరియాడిక్ మూవీలోనూ క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం 1945 బ్యాక్‌డ్రాప్‌లో అప్పట్లో జరిగిన నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతుంది. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలకు సిద్ధమవుతుంది.

 

Tags :