సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీలో నాచురల్ స్టార్?

సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీలో నాచురల్ స్టార్?

సూపర్ స్టార్ మహేష్ బాబు రెండేళ్ళ గ్యాప్  తర్వాత 'సర్కారు వారి పాట' సినిమాతో వచ్చారు. వరుస విజయాలను అందుకుంటున్న మహేశ్ ఖాతాలో మరో హిట్ చేరింది. ముందునుంచి కాస్త డివైడ్ టాక్ వచ్చినా కూడా ఫైనల్‌గా మాత్రం మాసివ్ హిట్ అందుకున్నారు. కీర్తి సురేశ్ గ్లామర్, పరశురామ్ మేకింగ్ మహేశ్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ థమన్ మ్యూజిక్..ఇలా ప్రతీది సర్కారు వారి పాట సక్సెస్‌కు కారణం అయ్యాయి. ప్రస్తుతం  సూపర్ స్టార్ మహేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో నటించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. సూపర్ స్టార్ సినిమాలో నేచురల్ స్టార్..త్రివిక్రమ్ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడా..? ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మిడియాలో చక్కర్లు కోడుతోంది. కాగా, త్వరలో మహేశ్ తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుండగా, మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిన సంస్థ నిర్మిస్తోంది. అయితే, తాజాగా ఈ మూవీకి సబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. మహేశ్ - త్రివిక్రమ్ సినిమాలో నేచురల్ స్టార్ నాని కూడా మరో హీరోగా నటించనున్నాడని ఇంకా నాని రోల్ ఎంటనేది తెలియనప్పటికీ ఈ న్యూస్ మాత్రం అటు మహేశ్ అభిమానుల్లో ఇటు నాని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మరి మేకర్స్ నుంచి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడొస్తుందో చూడాలి. కాగా, ఈ మూవీ తర్వాత మహేశ్ రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ సినిమాను చేయాల్సి ఉంది. ఇక నాని నటించిన అంటే సుందరానికి విడుదలకు సిద్దమవుతుండగా, దసరా చిత్రం సెట్స్‌పై ఉంది. ఈ మూవీ నాని ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం.

 

Tags :