అసెంబ్లీ ఘటనపై తొలిసారి స్పందించిన నారా భువనేశ్వరి!

అసెంబ్లీ ఘటనపై తొలిసారి స్పందించిన నారా భువనేశ్వరి!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీలో పరిణామాల తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు వెక్కివెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. తన భార్యపై అసభ్యంగా మాట్లాడారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ సీఎం అయ్యేదాకా అసెంబ్లీలో అడుగు పెట్టనంటూ ప్రతినబూనారు. ఈ ఘటనపై తాజాగా భువనేశ్వరి తన భావాలను వ్యక్తీకరించినట్లు తెలుస్తోంది. బాబు ఏడ్వడాన్ని చూసి భువనేవ్వరి కూడా ఇంట్లో బోరున విలపించారని సమాచారం. ఈ క్రమంలోనే ప్రెస్‌మీట్‌ అవ్వగానే ఇంటికి వెళ్లిన చంద్రబాబు, నారా లోకేశ్‌ను చూసి ఆమె మరింత ఏడ్చారని అంటున్నారు. ఆ తర్వాత వెంటనే కోలుకున్న ఆమె జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించ వద్దంటూ తన భర్తకు చెప్పినట్లు సమాచారం. దిగజారిన మనుషులు ఏవైనా మాట్లాడతారు. అవన్నీ మనసులో  పెట్టుకోవద్దు. వదిలేయండి. రాజకీయాల్లో ఒక్కోసారి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారి హయాంలోనూ కొందరు అలాగే మాట్లాడే వారన్నారు. చాలా నీచంగా మాట్లాడారు. బాధపెట్టడానికే ఇలాంటిని మాట్లాడతారు. మనసుకు బాధనిపిస్తుంది. అలాంటి వాటిని పట్టించుకోవద్దు. పక్కకు పడేసి మన పని మనం చేసుకుపోవాలి అంటూ ఆమె భర్తను అనునయించారని తెలుస్తోంది.

 

Tags :