యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు లండన్ నగరం లోని హౌన్స్ పట్టణంలో NRI TDP UK అధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. NRI TDP UK ప్రెసిడెంట్ పోపూరి వేణు మాధవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభకాంక్షలు తెలియజేసారు.

కోవెంట్రీ నగరంలో యూకె టీడీపీ వైస్ ప్రెసిడెంట్ చక్రి మొవ్వా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ నెల 27న ప్రారంభం కాబోతున్న 'యువగళం' పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ సంఘీభావంగా NRI TDP UK శ్రేణులు పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు.

అనంతరం సభాకార్యక్రమం నిర్వహించబడింది. సభా ప్రాంగణం 'సైకో పోవాలి సైకిల్ రావాలి' అనే నినాదంతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమం లో పలువురు ఎన్నారై టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూరుకుపోయిన అంధకారం తొలగిపోయి అభివృద్ధి బాటలో నడవాలంటే బాబుగారు మళ్ళీ సీఎం అవ్వాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో టీడీపీ యూకే నేతలు శ్రీకిరణ్ పరచూరి, ప్రసన్న నాదెండ్ల, సురేష్ కోరం, శ్రీనివాస్ పాలడుగు, నవీన్ జవ్వాడి, సుందర్ రాజు మల్లవరపు, మేరీ కల్పన, భాస్కర్ అమ్మినేని, అమర్నాథ్ మన్నే, కుమార్ నిట్టల తదితరులు పాల్గొన్నారు.


Click here for Photogallery

 

 

 

 

 

Tags :