ఆక్వా హాలిడేపై ప్రభుత్వం తక్షణమే... చర్యలు

ఆక్వా హాలిడేపై  ప్రభుత్వం తక్షణమే... చర్యలు

ఆక్వా హాలిడే ప్రకటించకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు నారా లోకేశ్‌ లేఖ రాశారు. విద్యుత్‌ చార్జీల పెంపు, రొయ్యల దాణా ధర పెరగడం, రొయ్యల ధర తగ్గడం వల్ల ఆక్వా హాలిడే ప్రకటిస్తున్నామన్న రైతుల నిర్ణయంపై ఇంత వరకూ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్‌ను రూపాయిన్నరకే ఇస్తానని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక యూనిట్‌పై రూ.2.36 పెంచి దారుణంగా మోసగించారని దుయ్యబట్టారు. 80 శాతం మంది ఆక్వా రైతులకు రాయితీలు ఎత్తివేయడం ద్రోహమే అని ధ్వజమెత్తారు. పరిశ్రమలు , వ్యవసాయరంగం దారిలోనే ఆక్వా హాలిడే తప్పక పోవచ్చని హెచ్చరించారు.

 

Tags :