అధ్వాన పాలనకి పక్కరాష్ట్రలు.. మన ఏపీని

అధ్వాన పాలనకి పక్కరాష్ట్రలు.. మన ఏపీని

అధ్వాన పాలనకి ఉదాహరణగా పక్కరాష్ట్ర పాలకులు మన ఆంధ్రప్రదేశ్‌ని చూపిస్తున్నా, ప్రభుత్వ స్పందన శూన్యమని  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాజకీయాలకు దూరంగా, అధ్మాత్మిక ప్రపంచానికి దగ్గరగా హిందూ ధర్మ ప్రచారమే జీవితలక్ష్యంగా సాగుతోన్న చిన జీయర్‌ స్వామి ఏపీలో రహదారుల దుస్థితిపై ఆవేదనతో స్పందించారని అన్నారు. గోతులు, ఒడుదొడుకుల గురించి జీయర్‌ స్వామి ప్రాస్తవించిన ఓ వీడియోను లోకేశ్‌ విడుదల చేశారు. జంగారెడ్డి గూడెం నుంచి రాజమహేంద్రవరం వరకూ రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాపకంగా మిగులుతుందంటూ రోడ్ల దుస్థితిని భక్తులను చెప్పారని గుర్తు చేశారు. ప్రవచనంలో భాగంగానే జీయర్‌ స్వామి చేసిన వ్యాఖ్యలతో  జగన్‌రెడ్డి పాలనలో రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టం అవుతోందని విమర్శించారు.

 

Tags :