భక్తి ఉంటే భార్య ఎందుకు రాదు?

భక్తి ఉంటే భార్య ఎందుకు రాదు?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొండపై గోవిందనామాల బదులు జగన్‌ నామస్మరణ మహాపరాధం అని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తి ఉంటే భార్య ఎందుకు రాదు? అని ప్రశ్నించారు. వేదపండితులు తలపై వేసిన ఆక్షింతల్ని అసహ్యంగా దులుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రసాదం వాసన చూడటం స్వామిపై ఎందుకీ దొంగ దైవభక్తి జగన్‌రెడ్డి గారు? అని ప్రశ్నించారు. స్వామి అమ్మవార్లకు పదేపదే  అపచారాలు తలపెడుతున్నారని అన్నారు. జగన్‌ రెడ్డిని రక్షించే గోవిందుడు అంటూ టీటీడీ చైర్మన్‌ సతీమణి అపచారపు నామస్మరణ స్వామివారికి తీరని కళంకమన్నారు.

 

Tags :