సొంత చెల్లెకు న్యాయం చేయలేని జగన్ .. రాష్ట్రానికి ఏం చేస్తారు?

సొంత చెల్లెకు న్యాయం చేయలేని జగన్ .. రాష్ట్రానికి ఏం చేస్తారు?

సొంత చెల్లెకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ రాష్ట్రానికి ఏం చేస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‍ నివాసం సమీపంలోనే మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం కింద 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. కానీ 21 నెలలైనా నేరస్థులకు శిక్షపడట్లేదు అన్నారు.

లేని దిశ చట్టాన్ని ఉందని మహిళలపై వైసీపీ మోసం చేస్తోందని దుయ్యబట్టారు. తాడేపల్లి, పులివెందుల సహా ఎక్కడా మహిళలకు భద్రత లేదన్నారు. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా వైసీపీ మేలుకోవడం లేదని తప్పుబట్టారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తోన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు న్యాయం చేయలేదని తెలిపారు. నరసరావుపేటలో అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్తుంటే అంత భయమెందుకు అని ప్రశ్నించారు.

 

Tags :