ఏపీ హైకోర్టులో నారా లోకేష్ కి ఊరట

ఏపీ హైకోర్టులో నారా లోకేష్ కి ఊరట

కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసును హైకోర్టు కొట్టేసింది.  విజయవాడ సూర్యారావుపేటలో ఈ కేసు నమోదైంది. 2021 జూన్‌ లో టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి శ్రీకాకుళం జిల్లాలోని ఆయన నివాసం నుంచి విజయవాడకు  రోడ్డు మార్గంలో తరలించిన సంగతి తెలిసిందే. ఈ సంద్భంగా ఆయనను పరామర్శించేందుకు సూర్యారావుపేట కోర్టు సెంటర్‌కి లోకేశ్‌ వచ్చారు. దీంతో, కొవిడ్‌ నిబంధనలను లోకేశ్‌ ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి ఈ ఏడాది మార్చిలో  విజయవాడ మొదటి అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టుకు లోకేశ్‌ హాజరయ్యారు. ఆ తర్వాత  ఈ కేసుకు సంబంధించి లోకేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టి వేయాలని తన పిటిషన్‌లో  కోరారు. లోకేశ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలను వినిపించారు. వాదనలను విన్న హైకోర్టు కేసును కొట్టేస్తూ తీర్పును వెలువరించింది.

 

Tags :