వైసీపీ నేతలపై కోర్టుకెక్కిన నారా లోకేష్.. మంగళగిరి కోర్టులో పిటిషన్

వైసీపీ నేతలపై కోర్టుకెక్కిన నారా లోకేష్.. మంగళగిరి కోర్టులో పిటిషన్

తన పరువుకు భంగం కలిగేలా కొందరు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని టీడీపీ కీలక నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టులో సదరు అధికార పార్టీ నేతలపై పిటిషన్ దాఖలు చేశారు. నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌లో వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు ఉన్నారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తన పిటిషన్‌లో నారా లోకేష్ అభ్యర్థించారు. వీళ్లంతా తనపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర రీతిలో ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీరిపై సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా వీరంతా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

 

 

Tags :