మీ మద్దతుతో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ

మీ మద్దతుతో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి మీరు మద్దతు పలకడంతో ప్రజల నుంచి మరింత సానుకూల స్పందన వచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను రఘురామ కలిశారు. అనంతరం రఘురామ మీడియాతో మాట్లాడుతూ మీరు అమరాతికి మద్దతు తెలపడంతోనే 3 రాజధానుల బిల్లును ప్రభుత్వం న్యాయస్థానం నుంచి ఉపసంహరించుకుందన్నారు. మళ్లీ బిల్లులు పెడతామంటున్నా అందుకు చాలా సమయం పడుతుంది. వివిధ కార్పొరేషన్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఆర్థికంగా దివాళా పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై నేను ఇప్పటిjకే ప్రధానమంత్రికి లేఖ రాశాను అని తెలిపారు. అదే విధంగా ఆ లేఖ కాపీని అమిత్‌షాకు అందజేసినట్లు తెలిపారు.

 

Tags :