నాటా భవన నిర్మాణానికి కమిటీ ఏర్పాటు

నాటా భవన నిర్మాణానికి కమిటీ ఏర్పాటు

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) వ్యవస్థాపకుడు, ప్రముఖ వైద్యుడు డా.ప్రేమ సాగర్‌ రెడ్డి పేరుమీదుగా న్యూజెర్సీలో నాటా భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణంకోసం తొమ్మిది మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు నాటా బోర్డు ప్రకటించింది. భవన నిర్మాణ కమిటీకి అధ్యక్షుడిగా డా రాఘవరెడ్డి గోసల, కార్యదర్శిగా ఆళ్ళ రామిరెడ్డి, కోశాధికారిగా గండ్ర నారాయణరెడ్డి, సభ్యులుగా కొర్సపాటి శ్రీధర్‌ రెడ్డి, సోమవరపు శ్రీనివాస్‌, వేల్కుర్‌ హరి, పెనుమాడ శ్రీకాంత్‌, మందపాటి శరత్‌, నరాల సతీష్‌ లను సభ్యులుగా నియమిస్తూ నాటా బోర్డు ప్రకటించింది.  

 

Tags :