నవంబర్ చివరి వారాంతంలో నాటా మహాసభలు

నవంబర్ చివరి వారాంతంలో నాటా మహాసభలు

సాంస్కృతిక వికాసమే నాటా మాట-సమాజ సేవయే నాటా బాట అన్న నినాదంతో కమ్యూనిటీకి ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) సేవలందిస్తోంది.  తెలుగు సాంస్కృతిక వైభవానికి తగిన ప్రోత్సాహాన్ని ఇస్తోంది. అటు అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి తనవంతు సాయంగా ప్రతిఏటా విభిన్న కార్యక్రమాలు, వేడుకలను నిర్వహిస్తోంది.

నాటా మెగా కన్వెన్షన్‌ 2021

నాటా మెగాకన్వెన్షన్‌కు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. న్యూజెర్సిలోని అట్లాంటిక్‌ సిటీలో నవంబర్‌ 25 నుంచి 27వరకు జరగనున్న నాటా మెగా కన్వెన్షన్‌కు విజయవంతం చేసేందుకు నాటా నాయకులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని నాటా అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల అన్నారు. నాటా అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ డా. ప్రేమ్‌ సాగర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నాటా కన్వెన్షన్‌ కమిటీ వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ఈ కన్వెన్షన్‌లో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌తోపాటు, అలూమ్ని, మాట్రిమోనియల్‌, యూత్‌ కార్యక్రమాలు, సిఎంఇ, బిజినెస్‌ సెమినార్‌, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ఈ మెగా కన్వెన్షన్‌కు అందరూ హాజరవ్వాలని ఆయన కోరారు. ఈ మెగాకన్వెన్షన్‌కు పురస్కరించుకుని నాటా ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను, పోటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కన్వెన్షన్‌ లోగో

ఇందుకోసం ప్రత్యేకమైన లోగోను నాటా నాయకులు తయారు చేశారు. తిరుమలలోని ఆనంద నిలయ విమానం, హైదరాబాద్‌లోని చార్మినార్‌, కర్నూలులోని కోటను వెనకాల అమెరికా సిటీతో రూపొందించిన ఈ లోగో అందరినీ ఆకట్టుకుంటోంది. సేవే లక్ష్యం, సంస్కృతే మార్గం అన్న నినాదాన్ని దాని మీద ముద్రించారు.

కన్వెన్షన్‌ కమిటీ

నాటా కన్వెన్షన్‌ కమిటీకి హరి వెల్కూర్‌ కన్వీనర్‌గా, శరత్‌ మందపాటి కో ఆర్డినేటర్‌గా, శ్రీనివాస్‌ ఈమని కో కన్వీనర్‌, శ్రీనివాస్‌ వాసిరెడ్డి కో కో ఆర్డినేటర్‌గా, సత్య పాటిల్‌ డిప్యూటీ కన్వీనర్‌, సతీష్‌ నరాల డిప్యూటీ కో ఆర్డినేటర్‌, అన్నారెడ్డి కన్వెన్షన్‌ నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు.

 

Tags :