నాటా థ్యాంక్స్‌ గివింగ్‌ డే సూపర్‌ 

నాటా థ్యాంక్స్‌ గివింగ్‌ డే సూపర్‌ 

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో నవంబర్‌ 25వ తేదీన న్యూజెర్సిలోని రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో నిర్వహించిన థ్యాంక్స్‌ గివింగ్‌ డే వేడుకలు విజయవంతంగా జరిగాయి. టాలీవుడ్‌ సింగర్‌ సాగర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దాదాపు 800 మందికిపైగా తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. న్యూయార్క్‌, న్యూజెర్సి, ఫిలడెల్పియాలోని దాదాపు 150 మంది కళాకారులు ఈ వేడుకల్లో తమ సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శించారు. ఆటలు, పాటలతో సందడిగా సాగిన ఈ వేడుకల్లో ఫ్యాషన్‌ షో కూడా ఆకట్టుకుంది. ఈ ఫ్యాషన్‌ షోలో 4 సంవత్సరాల చిన్నారుల నుంచి పెద్దల వరకు పాల్గొనడం విశేషం. నాటా ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డి గోసల మాట్లాడుతూ, తెలుగు కమ్యూనిటీకోసం నాటా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. నాటా భవన్‌ ప్లానింగ్‌ను ఈ సందర్భంగా అందరికీ ఆయన ప్రదర్శించారు. ఈ బిల్డింగ్‌ పూర్తవుతోందని ఇది పూర్తయితే సొంత భవనం ఉన్న తెలుగు అసోసియేషన్‌లలో నాటానే మొదటిది అని చెప్పారు. 

థ్యాంక్‌ గివింగ్‌ డే సందర్భంగా నాటా ఏర్పాటు చేసిన డిన్నర్‌, ఇతర కార్యక్రమాలు బావుందని అభినందిస్తూ, ఈ వేడుకలను ఏర్పాటు చేసిన నాటా నేషనల్‌ ఉమెన్స్‌ చైర్‌ ఉష చింతను, కల్చరల్‌ టీమ్‌ను అందరూ ప్రశంసించారు. టాలీవుడ్‌ సింగర్‌ సాగర్‌ తోపాటు డిజె ప్రసాద్‌ సింహాద్రి, దీప్తి, మనోజ్‌ ఇవ్వురు, శృతి, నేహ తదితరులు పాడిన పాటలు అందరినీ అలరించాయి. దాదాపు 800మందికిపైగా హజరవడంతో వేడుకలు జరిగిన హాలు నిండిపోయి కనిపించింది. 

Click here for Event Gallery

 

Tags :