అట్లాంటాలో ‘నాటా’ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్ విజయవంతం

నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘నాటా’ అట్లాంటా విభాగం నిర్వహించిన వాలీబాల్ మరియు త్రోబాల్ టోర్నమెంట్స్ విజయవంతంగా ముగిశాయి. మే 7వ తేదీన జరిగిన ఈ ఆటల పోటీల్లో పలువురు పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటారు. రాస్వెల్ నగరంలోని స్థానిక డాన్ వైట్ మెమోరియల్ పార్క్ లో నిర్వహించిన ఈ వాలీబాల్ మరియు త్రోబాల్ టోర్నమెంట్స్ కి మంచి స్పందన వచ్చింది. విజేతలకు టోర్నమెంట్స్ నిర్వాహకులు ట్రోఫీలు అందజేశారు. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ విజేత క్లౌడ్ ఆల్ఫారెటా జట్టు, రన్నర్ అప్ పంజాబ్ జట్టు. ఈ సందర్భంగా క్రీడాకారులు నాటా నేతలను అభినందించారు.ఈ క్రీడా కార్యక్రమంలో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘నాటా’ అట్లాంటా విభాగం నేతలు శ్రీనివాస్ కోట్లూర్, రవి కందిమళ్ల, వెంకట్ మొండెద్దు, గురు పరదారమి మరియు శ్రీనివాస్ కుక్కాడపు తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు.