న్యూజెర్సిలో ఘనంగా నాటా మహిళా దినోత్సవ వేడుకలు

న్యూజెర్సిలో ఉత్తర అమెరికా తెలుగు సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యూజెర్సిలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకల్లో మహిళలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. నాటా నేషనల్ ఉమెన్స్ కమిటీ చైర్ ఉషారాణి చింత ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. నాటా న్యూజెర్సి నాయకులు హరినాథ రెడ్డి వెల్కూర్ (ప్రెసిడెంట్ ఎలక్ట్), శరత్ మందపాటి (జాయింట్ సెక్రటరీ), శ్రీకాంత్ పెనుమాడ (బోర్డ్ డైరెక్టర్), అన్నారెడ్డి (బోర్డ్ డైరెక్టర్), లక్ష్మీ నారాయణ గోపిరెడ్డి (బోర్డ్ డైరెక్టర్), అంజిరెడ్డి సాగం రెడ్డి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), నగేష్ ముక్కామల్ల (ఐవిపి), సుజాత వెంపరాల (స్రిర్చువల్ చైర్), భానోజి రెడ్డి (ఆర్చివ్స్ అండ్ రికార్డ్స్ చైర్), మనోహర్ కదివిటి (నాటా ఫౌండేషన్ - ట్రస్ట్ ఫండ్ చైర్), రాఘవరెడ్డి గోశాల పాస్ట్ ప్రెసిడెంట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా అటార్నీ దియ ఎ మాథ్యుస్, కిమ్ గిల్ లా ఆఫీస్, ది పింక్ ఫౌండేషన్‌కు చెందిన కోమ్లిక గిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను కూడా ఇందులో ప్రదర్శించారు. ఫ్యాషన్ షో, గేమ్స్ ఇతర కార్యక్రమాలు జరిగాయి. డిజె మ్యూజిక్, డ్యాన్స్‌లతో కార్యక్రమాలు హోరెత్తాయి. ఉమెన్ షాపింగ్ మేళా కూడా సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి న్యూజెర్సికి చెందిన మహిళా నాయకులు మంజు భార్గవ, ప్రమీల గోపు, చైతన్య జుర్రు, రషి శంషాబాద్, దేవి ప్రసాద్, బిందు మాదిరాజు, జ్యోతి వంగల, విజయ రమేశ్, అనురాధ అరుణ్, కృష్ణవేణి, మనోహర బోగ, అనిత మీసాల, కల్పన అమ్ముల, ప్రసూన కడివెటి, హైమావతి రెడ్డి తదితరులు హాజరయ్యారు. దాదాపు 600 మందికిపైగా మహిళలు హాజరవడంతో వేడుకలు హుషారుగా సాగాయి.