ఆ దేశంతోనే భాగస్వామ్య దేశాలకు ముప్పు: నాటో

ఆ దేశంతోనే భాగస్వామ్య దేశాలకు ముప్పు: నాటో

రష్యాను తమ ప్రథమ శత్రువుగా నాటో ప్రకటించింది. ఆ దేశంతోనే తమ భాగస్వామ్య దేశాలకు నేరుగా ముప్పు ఉందని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మైక్రాన్‌ సహా 30 మంది దేశాధినేతలు.. మాద్రీద్‌లో జరిగిన నాటో సదస్సులో రానున్న పదేళ్ల కోసం వ్యూహాత్మక విధాన ప్రకటన విడుదల చేశారు. ఇందులో రష్యాతో ముప్పునే ప్రధానంగా ప్రాస్తావించారు. ఆసక్తికరమైన విషయమేంటంటే 2010లో విడుదల చేసిన డిక్లరేషన్‌లో రష్యాను భాగస్వామి దేశంగా నాటో పేర్కొంది. ఉక్రెయిన్‌పై మాస్కో సైనిక చర్యతో ఈ సమీకరణాలు మారిపోయాయి. రష్యాతో తాము స్పర్థను కోరుకోవడం లేదని, అయితే ఆ దేశ బెదిరింపులకు దీటుగా సమాధానం చెబుతామని కూటమి దేశాలు మాద్రీద్‌లో తీవ్రంగా హెచ్చరించాయి.

ఈ సదస్సుకు ఆతిథ్య దేశాలుగా జపాన్‌, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ హాజరయ్యాయి. వ్యూహాత్మక విధాన ప్రకటనతో రష్యాతో పాటు చైనా ప్రస్తావనా ఉంది. చైనా లక్ష్యాలు, విధానాలు తమ భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయని నాటో పేర్కొంది.

 

Tags :