కృష్ణంరాజు మృతి పట్ల నాట్స్ సంతాపం

కృష్ణంరాజు మృతి పట్ల నాట్స్ సంతాపం

మనస్సున్న మారాజు లేరనే వార్త జీర్ణించుకోలేనిది : నాట్స్

వెండితెరపై భక్తకన్నప్పగా మరిపించి తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మనస్సున్న మారాజు కృష్ణంరాజు ఇక లేరనే వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. వెండితెరపై ఆయన పోషించిన పాత్రలు తెలుగువారు ఎప్పటికి మరిచిపోలేరని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి పేర్కొన్నారు. తెలుగుజాతికి ఆయన లేని లోటు పూడ్చలేనిదాని అన్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా.. ఉన్నత విలువలు ఉన్న వ్యక్తిగా.. ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన రాజకీయ నాయకుడిగా కృష్ణంరాజు తెలుగువారికే ఓ స్ఫూర్తిలా నిలిచారని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి తెలిపారు. కృష్ణంరాజు కుటుంబానికి అమెరికాలో తెలుగు ప్రజల తరపున తమ ప్రగాఢ సానూభూతిని తెలిపారు.

 

Tags :