డల్లాస్ లో నాట్స్ ఆధ్వర్యంలో మినీ తెలుగు సంబరాలు

డల్లాస్ లో నాట్స్ ఆధ్వర్యంలో మినీ తెలుగు సంబరాలు

నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాట్స్‌) ఆధ్వర్యంలో డల్లాస్‌లో మార్చి 25, 26, 2022 తేదీల్లో మినీ తెలుగు సంబరాలు నిర్వహిస్తోంది. ఇర్వింగ్‌లోని టయోటా మ్యూజిక్‌ ఫ్యాక్టరీలో ఈ మినీ తెలుగు సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మార్చి 26వ తేదీన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సంగీత కచేరి జరుగుతుంది. కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై రాత్రి 11:30 గంటల వరకు జరుగుతాయి. దీంతోపాటు తారలచే అనేక సాంస్కృతిక అంశాలు, కామెడీ స్కిట్‌లు మరియు నృత్య అంశాలు కూడా ప్రదర్శించనున్నారు. గాయనీ గాయకులు అఖిల మన్మధూర్‌, శృతి నండూరి, శ్రీకాంత్‌ సందుగు, ప్రసాద్‌ సింహాద్రి ఈ కార్యక్రమంలో పాటలను పాడనున్నారు. సాహిత్య వింజమూరి యాంకర్‌గా వ్యవహరించనున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, పశ్చిమగోదావరి మాజీ జడ్‌పిటిసి చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజుతో పాటు పలువురు సినీతారలు కూడా వస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుట్‌, హెబ్బాపటేల్‌, రవి ప్రకాష్‌, పూజా జవేరి, భానుశ్రీ, నందినీ రెడ్డి, చంటి, ఇమ్మాన్యుయేల్‌, నూకరాజు, సుధాకర్‌, చైతన్య తదితరులు పాల్గొంటున్నారు. ఈ మినీ సంబరాలకు అందరూ రావాలని నాట్స్‌ చైర్‌ఉమెన్‌ అరుణగంటి, నాట్స్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ శేఖర్‌ అన్నె కోరారు.

 

Tags :