హ్యూస్టన్ లో నాట్స్ టెన్నీస్ టోర్నమెంట్

హ్యూస్టన్ లో నాట్స్ టెన్నీస్ టోర్నమెంట్

ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు క్రీడాకారులు

తెలుగు వారి కోసం అమెరికాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) తాజాగా బాల, బాలికలలో  క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు టెన్నీస్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్  సింగిల్స్ టెన్నీస్ టోర్నమెంట్‌కు మంచి స్పందన లభించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ టెన్నీస్ టోర్నమెంట్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. నాట్స్ హ్యూస్టన్ సహ సమన్వయకర్త చంద్ర తెర్లీ  నాట్స్ క్రీడా సమన్వయకర్త ఆదిత్య దామెర  నేతృత్వంలో ఈ టోర్నెమెంట్ జరిగింది. 

నాట్స్ హ్యూస్టన్ సమన్వయకర్త విజయ్ దొంతరాజు, నాట్స్ నాయకులు సునీల్ పాలేరు, సుమిత్ అరిగెపూడి, శ్రీనివాస్ కాకుమాను, వీరు కంకటాల, వంశీ తాతినేని తదితరులు ఈ టోర్నెమెంట్ విజయానికి కృషి చేశారు. హ్యూస్టన్, గ్రేటర్ హ్యూస్టన్ ప్రాంతంలోని తెలుగువారందరికీ నాట్స్ ఎప్పుడూ వెన్నంటి ఉండి తమ సహాయ సహకారాలను అందిస్తుందని నాట్స్ బోర్డు సభ్యులు సునీల్ పాలేరు అన్నారు. చక్కటి సమన్వయంతో, క్రీడా స్ఫూర్తితో, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ పోటీలు నిర్వహించిన నాట్స్ హ్యూస్టన్ విభాగానికి నాట్స్ కేంద్ర కమిటీ సభ్యులు, కోశాధికారి హేమంత్ కొల్ల అభినందలు తెలిపారు.

క్రీడా నైపుణ్యత ఆధారంగా బాలబాలికలకు రెండు విభాగాలుగా జరిగిన ఈ పోటీలకు ప్రతి విభాగంలోనూ ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న క్రీడాకారులకు నాట్స్ ట్రోఫీలను అందజేసి సత్కరించింది. తెలుగు వారిలో ఉత్సాహం నింపేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడంపై నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి నాట్స్ హ్యూస్టన్ విభాగాన్ని అభినందించారు.

 

Click here for Event Gallery

 

Tags :
ii). Please add in the header part of the home page.