MKOne Telugu Times Youtube Channel

గూగుల్ కు మరోసారి గట్టి షాక్

గూగుల్ కు మరోసారి గట్టి షాక్

ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌కు మరోసారి గట్టి షాక్‌ తగిలింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో  సిస్టమ్‌లో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను గూగుల్‌కు గతంలో కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఎల్‌)  భారీ జరినామా విధించిన విషయం తెలిసిందే.  ఆ విషయంలో గూగుల్‌ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ)ను ఆశ్రయించగా ఎదురు దెబ్బ తగిలింది. 30 రోజుల్లోపు సీసీఐ విధించిన జరిమానా రూ.1337.76 కోట్లను డిపాజిట్‌ చేయాల్సిందేనని ఎన్‌సీఎల్‌ఏటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇద్దరు సభ్యులతో కూడిన ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్‌ గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది. గతేడాది అక్టోబర్‌ 20న కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా గూగుల్‌కు రూ.1337.76 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అలాగే, అనైతిక వ్యాపార పద్ధతులను మానుకోవాలని, తన ప్రవర్తనను మార్చుకోవాలని కూడా హితవు పలికింది. అయితే సీసీఐ ఆదేశాలను సవాల్‌ చేస్తూ గూగుల్‌ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఎన్‌సీఎల్‌ఏటీ గూగుల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. సీసీఐ విచారణలో సహజ న్యాయ ఉల్లంఘనలేమీ జరగలేదని తేల్చి చెప్పింది.

 

 

Tags :