అమెరికా విదేశాంగ ప్రతినిధిగా వేదాంత్ పటేల్

రెండేళ్ల నుంచి అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధిగా ఉన్న నెడ్ ప్రైస్ ఈ నెలలో ఆ పదవి నుంచి వైదొలగుతున్నారని విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. నెడ్ ప్రైస్ గతంలో అమెరికా గూఢచారి సంస్థ సీఐఏలో పని చేశారు. ఒరాక్ ఒబామా ప్రభుత్వంలో జాతీయ భద్రతా మండలి ప్రతినిధిగా వ్యవహరించారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ప్రైస్ తన పదవికీ రాజీనామా చేశారు. ప్రైస్ స్థానంలో కొత్త విదేశాంగ ప్రతినిధి నియమితులయ్యే వరకు భారత సంతతికి చెందిన వేదాంత్ పటేల్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఆయన ప్రస్తుతం విదేశాంగ శాఖ ఉప ప్రతినిధిగా ఉన్నారు.
Tags :