ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు.. ప్రపంచ దేశాలు ఇప్పుడు

ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు.. ప్రపంచ దేశాలు ఇప్పుడు

దేశంలో నిరుద్యోగ సమస్యపై మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ వార్షిక సాధారణ సమవేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లు చైనాపై ఆధారపడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయని, ఆ ఫలాలు అందుకోవాలంటే నిరుద్యోగ సమస్య అధిగమించాల్సి ఉందన్నారు. అందుకోసం తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారిలో కేవలం 40 శాతం మందికే పని లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కొన్ని లోపాలను సరిదిద్దుకోవాలి. అందులో నిరుద్యోగ సమస్య ఒకటి. భారత్‌లో నిరుద్యోగిత 7-8 శాతానికి చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. జీడీపీ వృద్ధి చెందినంత వేగంగా ఉద్యోగాలు వృద్ధి చెందడం లేదన్నారు. పనిచేయగల, పనిచేయడానిjకి సిద్ధంగా ఉన్న వారిలో కేవలం 40 శాతం మందికే పని దొరుకుతోంది. ఉపాధి అవకాశాలు లేక యువత, మహిళలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు.

 

Tags :