సమంత 'శాకుంతలం' సినిమా గురించి నీలిమా గుణ అప్‌డేట్

సమంత 'శాకుంతలం' సినిమా గురించి నీలిమా గుణ అప్‌డేట్

సమంత  కీలక పాత్రలో గుణశేఖర్  డైరెక్షన్‌‌లో తెరకెక్కిన మూవీ 'శాకుంతలం'. ఎప్పుడో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ సమంత  వరుస సినిమాలతో బిజిబిజీగా ఉంటోంది. త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ.. త్వరలో 'శాకుంతలం' మూవీ ద్వారా పాన్ ఇండియా లెవల్లో ఆడియన్స్‌ను అలరించనుంది. దర్శకుడు గుణశేఖర్  డైరెక్షన్‌‌లో తెరకెక్కిన ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మైథలాజికల్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ.. గ్రాఫిక్స్ కోసం చిత్ర బృందం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి తాజాగా గుణశేఖర్ కూతురు, ప్రొడ్యూసర్ నీలిమా గుణ అప్‌డేట్ ఇచ్చారు.'

శాకుంతలం సినిమా గురించి అప్‌డేట్‌లు కోరుతూ ట్వీట్లు చేస్తున్న అభిమానులందరికీ కోసం ఈ పోస్ట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మంచి అవుట్ పుట్ అందించేందుకు కష్టపడుతున్నాం.. గ్రాఫిక్స్ వర్క్స్‌ కోసం ఎక్కువ టైమ్ అవుతోంది. మీ మద్దతు మా సినిమాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ మీకు తెలియజేస్తాం..' అంటూ నీలిమా గుణ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌ను బట్టి చూస్తుంటే.. శాకుంతలం మూవీ విడుదలకు మరింత సమయం పట్టేలా ఉన్నట్లు తెలుస్తోంది. పౌరాణిక గాథ ఆధారంగా గుణశేఖర్ శాకుంతులం మూవీని రూపొందించారు. మహాభారతంలోని ఆదిపర్వంలో దుష్యంతుడి శాకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దుష్యంతుడి క్యారెక్టర్‌లో మలయాళ హీరో దేవ్ మోహన్ యాక్ట్ చేశారు. తెలుగు, హిందీ, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా.. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

Tags :