భారత్ లో అలాంటి చట్టాలు ఎందుకు తీసుకురారు ? : నల్లపురెడ్డి

భారత్ లో అలాంటి చట్టాలు ఎందుకు తీసుకురారు ? : నల్లపురెడ్డి

మహిళలపై దౌర్జన్యం చేస్తే మానవమృగాలను పక్క దేశాల్లో నడిరోడ్డపై ఉరితీస్తారని, భారత్‌ అలాంటి కఠిన చట్టాలు ఎందుకు తీసుకురారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలంలో జరిగిన ఆసరా పథకం రెండోవిడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసన్నకుమార్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేసే చట్టాలు రావాలని అన్నారు. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళల రక్షణ కోసం చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. చట్టాలలో మార్పు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. మానభంగం చేసిన వారిని పట్టుకుని శిక్షిస్తే సరిపోదని, నడిరోడ్డుపై మర్మాంగాలు కోసి, కాళ్లు చేతులు నరికేస్తేనే వారిలో భయం వస్తుందన్నారు. ముఖ్యమంత్రి తీసుకొచ్చిన దిశ చట్టం ద్వారా కొంత వరకు మహిళలకు న్యాయం జరుగుతుందన్నారు.

 

Tags :