నెట్‌ఫిక్స్‌ మరో కీలక నిర్ణయం.. 300 మందిని

నెట్‌ఫిక్స్‌ మరో కీలక నిర్ణయం.. 300 మందిని

మార్కెట్లో ప్రత్యర్థుల పోటీ, విపరీతంగా సబ్‌స్కైబర్లను కోల్పోతున్న స్ట్రీమింగ్‌ దిగ్గజం నెట్‌ఫిక్స్‌ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కాస్ట్‌ కటింగ్‌లో భాగంగా రెండో విడత ఉద్యోగాల్లో కోత విధించింది నెట్‌ఫ్లిక్స్‌. ఉద్యోగుల్లో 4 శాతం లేదా దాదాపు 300 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. గత నెలలో చేసిన కట్‌ కంటే రెండు రెట్లు ఎక్కువ. వ్యాపారంలో గణనీయంగా పెట్టుబడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో కొన్ని సర్దబాట్లు, ఆదాయ వృద్ధికి అనుగుణంగా పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయమని నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధి తెలిపారు. నెట్‌ఫ్లిక్‌ వృద్ధికి వారు చేసిన కృషికి కృతజ్ఞతలం. ఈ కష్టకాలంలో వారికి మద్దతివ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

 

Tags :