న్యూజెర్సిలో టీటీఎ ఫండ్‌రైజింగ్ సక్సెస్

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న మెగా కన్వెన్షన్ కిక్ ఆఫ్ ఈవెంట్, ఫండ్ రైజర్ కార్యక్రమాన్ని న్యూజెర్సీ ఎడిసన్ లోని షేరటన్ హోటల్ లో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు $472K డాలర్లు విరాళంగా వచ్చాయి..
న్యూజెర్సీ బృందం టిటిఎ-మెగా కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రైజర్ డిన్నర్‌ని న్యూజెర్సీలో నవంబర్ 13, 2021 శనివారం సాయంత్రం 6.00 నుండి 11.00 గంటల వరకు జరిగింది. దాదాపు 300 మంది ప్రతినిధులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. టిటిఎ మెగా కన్వెన్షన్ మే 27, మే 28-మే 29, 2022 లో (మెమోరియల్ డే వీక్ ఎండ్) న్యూజెర్సీ లోని, న్యూజెర్సీ ఎక్స్ పో లో జరుగనుంది.
మరిన్ని వివరాల కోసం www.ttaconvention.org ని చూడవచ్చు.
ఈ కార్యక్రమాన్ని డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి (టిటిఎ వ్యవస్థాపకుడు), డాక్టర్ విజయపాల్ రెడ్డి ( టిటిఎ, చైర్), డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల (%Aజ%-కో-ఛైర్) డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల, ప్రెసిడెంట్, శ్రీనివాస్ గనగోని కన్వీనర్, వంశీ రెడ్డి ప్రెసిడెంట్ ఎలెక్ట్, గంగాధర్ ఉప్పల కో ఆర్డినేటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌తో పాటు న్యూజెర్సీ బృందం మరియు టిటిఎ టీమ్ ఆధ్వర్యంలో ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.
తానా, ఆటా, నాటా, నాట్స్, టిఫాస్, టిడిఎఫ్ మరియు ఇతర స్థానిక సంస్థల నుండి ప్రతినిధులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు
న్యూజెర్సీలో జరుగనున్న టిటిఎ మెగా కన్వెన్షన్ 2022కి మద్దతుగా విరాళాలు సేకరించడం జరిగింది.
కార్యక్రమానికి హాజరైన ప్రముఖ వ్యక్తుల సహకారంతో ఈవెంట్ విజయవంతం అయింది. కమ్యూనిటీలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన వారు న్యూజెర్సీ మెగా కన్వెన్షన్ కోసం మద్దతుగా $472K డాలర్స్ విరాళాలుగా ఇచ్చారు.ఇది టిటిఎకు గర్వకారణం.
ఈ కిక్ ఆఫ్ మరియు ఫండ్ రైజింగ్ ఈవెనింగ్ గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రెసిడెంట్ మరియు కన్వీనర్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో అమెరికా లోని ఇతర ప్రాంతాలలో జరిగే నిధుల సేకరణ కార్యక్రమాలకు ప్రణాళికలు కూడా రూపొందించినట్లు టిటిఎ కన్వీనర్ శ్రీనివాస్ గనగోని తెలిపారు.