ఏపీ, తెలంగాణకు కొత్త న్యాయమూర్తులు

ఏపీ, తెలంగాణకు కొత్త న్యాయమూర్తులు

తెలుగు రాష్ట్రాలకు కొత్త న్యాయమూర్తులు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టుకు బదిలీపై ఇద్దరు కొత్త న్యాయమూర్తులు వస్తున్నారు. పట్నా హైకోర్టు నుంచి జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో సేవలందిస్తున్న జస్టిస్‌ ఎంఎస్‌ఎస్‌ రామచంద్రరావు పంజాబ్‌`హరియాణా హైకోర్టుకు బదిలీ కాగా, ఆ స్థానంలో బాంబే హైకోర్టు నంచి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ తెలంగాణ హైకోర్టుకు వస్తున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారస్సుల మేరకు దేశవ్యాప్తంగా 15 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీనిపై కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

Tags :