లుసియానా, మిసిసిపీ పై విరుచుకుపడ్డ హరికేన్

లుసియానా, మిసిసిపీ పై  విరుచుకుపడ్డ హరికేన్

అమెరికాను ఐదా హరికేన్‍ వణికిస్తోంది. లుసియానా, మిసిసిపీ రాష్ట్రాలను గడగడలాడిస్తోంది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే లుసియానా రాష్ట్రం దక్షిణ తీర ప్రాంతంలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుముద్ర తీర, నదీ పరివాహక ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. టెలికాం వ్యవస్థ స్తంభించడంతో అత్యవసర వైద్యం, అగ్నిమాపక, పోలీసు సేవలకు సంబంధించిన టోల్‍ఫ్రీ నంబరు 911 కూడా మొరాయించింది. విద్యుత్తు పంపిణీ వ్యవస్థ దెబ్బతిన్నడంతో ఆదివారం రాత్రి న్యూ ఆర్లియన్స్ నగరంలోని చాలా ప్రాంతాల ప్రజలు చీకట్లో గడపాల్సి వచ్చింది. దీంతో 16 ఏళ్ల కిందటి కత్రినా హరికేన్‍ తరహా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

 

Tags :