సీఎస్ సమీర్‌శర్మ కోసం... కొత్త పోస్టు సృష్టించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్‌గా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న సమీర్‌శర్మ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టు సృష్టించింది. పదవీ విరమణ అనంతరం ఆయన్ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో చీఫ్ సెక్రటరీగా సమీర్ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కోసం సీఎం కార్యాలయంలో కొత్త పోస్టును సృష్టించారు.
Tags :