విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏపీ టూరిజం

విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏపీ టూరిజం

దేశంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖ పర్యటనలో భాగంగా బావికొండ బుద్జిజం ప్రాంతంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో కలిసి పర్యటించారు. టూరిజంలో భాగంగా తీసుకోవాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి అధికారులతో కలిసి చర్చించారు. అనంతరం కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ  టూరిజం పరంగా విశాఖపట్నం ఎన్నో అవకాశాలు కలిగి ఉందని, దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యటకులను మరింత ఆకర్షించేలా అభివృద్ధి పనులు చేస్తామన్నారు.  టూరిజం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ అద్భుత అవకాశాలు కలిగి ఉందని, ఇందు కేంద్రం నుంచి మరిన్ని ప్రోత్సాహం అందిస్తామని అన్నారు.

 

Tags :