రష్యాపై అమెరికా కొత్త ఆంక్షలు

ఉక్రెయిన్, రష్యా యుద్దానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. రష్యా సంస్థలు, బ్యాంకులు, తయారీ సంస్థలు, లోహ, గనుల తవ్వక రంగాలకు చెందిన కంపెనీలు, పలువురు పౌరులపై అమెరికా నూతన ఆంక్షలు అమలుకానున్నాయి. జీ-7 దేశాలతో సంప్రదింపుల అనంతరం కొత్త ఆంక్షలను విధించింది. ఇవి రష్యాపై స్వల్పకాల, దీర్ఘకాల ప్రభావం చూపనున్నాయని అమెరికా ఆర్థికమంత్రి జానెట్ యెలెన్ ఓ ప్రకటనలో తెలిపారు.
Tags :