న్యూయార్క్‌లో హెల్త్ ఎమర్జెన్సీ

న్యూయార్క్‌లో హెల్త్ ఎమర్జెన్సీ

అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లో మంకీ పాక్స్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి విధించారు. నగరంలోని లక్షన్నర మంది ప్రజల క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌, హెల్త్‌ అండ్‌ మెంటల్‌ హైజీన్‌ విభాగ కమిషనర్‌ అశ్విన్‌ వాసన్‌ తెలిపారు. ప్రస్తుతం న్యూయార్క్‌ రాష్ట్రవ్యాప్తంగా 1,400 మంకీ పాక్స్‌ కేసులున్నాయి. నగరం వైరస్‌ వ్యాప్తి కేంద్రంగా మారింది. దీంతో కట్టడి చర్యలకు వీలుగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మరోవైపు టీకాల పంపిణీని వేగిరం చేసేందుకు ఫెడరల్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

 

Tags :