భారత్ కు న్యూయార్క్ సాయం.. 40 లక్షల

భారత్ కు న్యూయార్క్ సాయం..  40 లక్షల

భారతదేశానికి న్యూయార్క్ సిటీ సాయం ప్రకటించింది. కరోనాతో వైరస్‍ విజృంభిస్తున్న పరిస్థితుల్లో అవసరమైన వైద్య సామగ్రి పంపనున్నట్లు మేయర్‍ బిల్‍ డి బ్లాసియో ప్రకటించారు. 40 లక్షల టెస్ట్ కిట్లు, మూడు లక్షల పల్స్ ఆక్సీమీటర్లు, 300 వెంటిలెటర్లు, బిపాప్‍ యంత్రాలు, ఇతర వైద్య సామగ్రిని పంపుతున్నట్లు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో సహాయ చేయడం తమవంతని ఎవరూ ఒంటరిగా లేరని, ఈ మేరకు స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు వైద్య పరికరాలను పంపుతున్నట్లు తెలిపారు. మేయర్‍ ప్రకటనపై భారత కాన్సుల్‍ జనరల్‍ రణధీర్‍ జైస్వాల్‍ అభినందనలు తెలిపారు. న్యూయార్‍ విరాళంగా ఇచ్చిన వెంటిలేటర్లు, టెస్టింగ్‍ కిట్లు మహమ్మారిపై పోరాడేందుకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు.

 

Tags :