న్యూయార్క్ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం

న్యూయార్క్ చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో బహుళ అంతస్తుల  భవనంలో ఘోర అగ్ని ప్రమాదంలో 19 మంది మరణించారు. వీరిలో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో తొమ్మిది మందికి తీవ్రంగా గాయలయ్యాయి. ఎలక్ట్రిక్‌ స్పేస్‌ హీటర్‌ సరిగా పనిచేయడకపోవడం వల్ల మంటలు చెలరేగాయి. ఒక అపార్ట్‌మెంట్‌లో బెడ్‌రూమ్‌లో ఈ హీర్‌ కారణంగా రేగిన మంటలు వెంటనే ఆ  గదినిండా, తర్వాత మొత్తంగా అపార్ట్‌మెంట్‌ అంతా వ్యాపించాయి.

న్యూయార్క్‌ నగర చరిత్రలో అత్యంత ఘోర అగ్నిప్రమాదాల్లో ఇదొకటి. 19 అంతస్తుల ఈ భవనం ఉదయం 11 గంటల సమయంలో మంటలు రేగి ప్రమాదం సంభవించింది. దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి పోరాడాల్సి వచ్చిందని న్యూయార్‌ అగ్నిమాపక విభాగం తెలిపింది. ఆ ప్రాంతమంతా దట్టమైన మంటలు, పోగతో నిండిపోయిందని అగ్నిమాపక దళ కమిషనర్‌ డేనియర్‌ తెలిపారు. మొత్తంగా భవనంలోని అన్ని అంతస్తులు పొగతో నిండిపోయిందని, ప్రతి అంతస్తుల్లో, మెట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ స్పృహ తప్పి పడిపోయి వున్నారని, వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించామని తెలిపారు.

 

Tags :