న్యూజిలాండ్ ప్రధాని సంచలన నిర్ణయం

న్యూజిలాండ్ ప్రధాని సంచలన నిర్ణయం

న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించి షాక్‌ ఇచ్చారు. అధికార లేబర్‌ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన రాజీనామకు ఇదే తగిన సమయమని వ్యాఖ్యానించారు. ఈ రాజీనామా నిర్ణయం వెనుక ఎలాంటి రహస్యం లేదని స్పష్టం చేశారు. ఒక దేశానికి నాయకత్వం వహించడం అనేది అత్యంత ఉన్నతమైంది. పెద్ద బాధ్యతను అందిస్తుంది. సవాలుతో కూడుకున్న పని ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం పూర్తిస్థాయిలో లేనప్పుడు కొనసాగలేం. అంతేగాక మనం నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తి? కాదా? అనేది తెలుసుకోవడం కూడా ఒక బాధ్యతే అని పేర్కొన్నారు.

 

 

Tags :