ఆన్‍లైన్‍ లో నులక మంచం వేలం... ధర ఎంతో తెలుసా?

ఆన్‍లైన్‍ లో నులక మంచం వేలం... ధర ఎంతో తెలుసా?

మన దేశంలో ఎవరైనా సరే మంచాల మీదే విశ్రాంతి తీసుకుంటారు.  ఇవి దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. పల్లెల్లో కనిపించే నులక మంచాన్ని సాధారణంగా ఇంట్లోనే అల్లుతుంటారు. ఒకవేళ బయట దీన్ని తయారు చేయించాలంటే రూ.మూడు వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే న్యూజిలాండ్‍కు చెందిన ఆన్‍లైన్‍ ఈ-కామర్స్ సంస్థ అనాబెల్‍ భారత్‍కు చెందిన ఓ నులక మంచాన్ని ఏకంగా రూ.41.297కు అమ్మకానికి పెట్టింది. వాస్తవానికి మంచం ఖరీదు రూ.61,980 అయినప్పటికీ, వినియోగారులను ఆకర్షించడానికి రూ. 20 వేల డిస్కౌంట్‍ ఇస్తున్నట్టు ప్రకటించింది. భారతదేశానికి సంబంధించిన ఉత్పత్తులకు విదేశాల్లో ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. న్యూజిలాండ్‍లో భారత్‍కు సంబంధించిన ఉత్పత్తిని అధిక ధరకు కొనుగోలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో భారత్‍కు చెందిన చాలా వస్తువుల విషయంలో ఇలానే జరిగింది.

 

Tags :