MKOne TeluguTimes-Youtube-Channel

ఆ 40 రోజులు కీలకం : కేంద్రం

ఆ 40 రోజులు కీలకం : కేంద్రం

చైనాను హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ బిఎఫ్‌.7 వ్యాప్తిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. అదే సమయంలో దేశంలో కొవిడ్‌ వ్యాప్తి కట్టడికి కూడా చర్యలు ప్రారంభించింది. అయితే వచ్చే నెలలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే 40 రోజులు అత్యంత కీలకమని అధికారవర్గాలు చెబుతున్నాయి.  గతంలో తూర్పు ఆసియాలో కొవిడ్‌ కొత్తవేవ్‌ మొదలైన 30-35 రోజుల తర్వాత భారత్‌కు విస్తరించింది. ఈ ట్రెండ్‌ను బట్టి జనవరిలో దేశ్యాప్తంగా కేసులు పెరగొచ్చు అని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈసారి వైరస్‌ తీవ్రత తక్కువగానే ఉంటుందన్న అంచనాలు కాస్తంత ఊరటనిచ్చేలా ఉన్నాయి. ఒకవేళ బిఎఫ్‌.7 వేరియంట్‌ వచ్చినా దేశంలో కొవిడ్‌ మరణాలు, ఆస్పత్రుల్లో చేరికల పరిస్థితులు తక్కువగానే ఉండొచ్చని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

 

 

Tags :