చిన్నప్పుడు నేనూ బాధితుడినే : రిషి సునాక్

చిన్నప్పుడు నేనూ బాధితుడినే : రిషి సునాక్

జాత్యహంకార ఆరోపణలకు బ్రిటన్‌ రాజభవనం బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ మరోసారి వేదికయ్యింది. నల్లజాతి సంతతికి చెందిన నగోజీ పులాని అనే మహిళపై ప్రిన్స్‌ విలియమ్‌ గాడ్‌మదర్‌ సుసాన్‌ హుస్సే జాతివివక్ష చూపారన్నది తాజా వివాదం. ఈ విషయంలో బయటపడటంతో సుసాన్‌ హుస్సే ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతూ క్షమాపణలు కోరారు. ఈ నేపథ్యంలో  జాతివివక్షపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ స్పందించారు. వివాదంపై తాను వ్యాఖ్యానించడం సరికాదన్న ఆయన.. తన జీవితం లోనూ జాత్యహంకారాన్ని ఎదుర్కొన్న సందర్భాలను గుర్తు చేసుకొన్నారు. చిన్నతనంలో,  యుక్త వయసులో ఉన్నప్పుడు నాకు అటువంటి సంఘటనలు ఎదురయ్యాయి. అవి నేటికి కొనసాగుతున్నాయంటే నమ్మశక్యంగా లేదు. జాత్యహంకారన్ని ఎదుర్కోవడంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. ఈ ప్రయత్నం ఎన్నటికీ ముగిసిపోదు. మనకు అటు వంటి సందర్భం ఎప్పుడు ఎదురైనా దీటుగా ఎదుర్కోవాలని అని అన్నారు.

 

Tags :