పీఎఫ్ఐ ఆఫీసులపై ఎన్ఐఏ దాడులు.. హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

పీఎఫ్ఐ ఆఫీసులపై ఎన్ఐఏ దాడులు.. హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఆఫీసులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ నిర్వహించారు. దీనిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా తదితర అధికారులు పాల్గొన్నారు. అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో పీఎఫ్ఐ కార్యకర్తలు, ఉగ్ర అనుమానితుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. యువతకు శిక్షణ ముసుగులో పీఎఫ్ఐ పలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపణలు ఉన్నాయి. యువతలో తీవ్రవాద భావజాలాలను పెంచుతూ, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సేకరించడం వంటి చర్యలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్ఐఏ, ఈడీ సంస్థలు పీఎఫ్ఐ ఆఫీసులు, సభ్యుల ఇళ్లపై దాడులు చేశారు. ఇవి ముగిసిన తర్వాత పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

 

Tags :