అమెరికాను ద్వేషించే దేశాలకు ఒక్క పైసా కూడా ఇవ్వను

తాను అధ్యక్షురాలినైతే అమెరికాతో ద్వేషభావంతో వ్యవహరిస్తున్న దేశాలన్నింటికీ విదేశీ నిధులను నిలిపివేస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న తొలి ఇండో అమెరికన్ నిక్కీ హేలీ ప్రకటించారు. తమ సహాయం పొందుతూనే, తమపై ద్వేషం, శత్రుత్వంతో ఉన్న కొన్ని దేశాల వైఖరిని ఆమె ఎండగట్టినట్లు తెలిసింది. ద్వేష వైఖరిని ప్రదర్శించే దేశాలకు ప్రతి రూపాయిని కట్ చేస్తానని, అమెరికా ప్రజలు ఎంతో కష్టపడి కూడగట్టన సంపదను అలాంటి వారికి ఎందుకు ధారపోయాలని ఆమె ప్రశ్నించారు. గత ఏడాది అమెరికా 46 బిలియన్ డాలర్లు విదేశాలకు సహాయంగా అందించిందని, అందులో చాలా మొత్తం అగ్రరాజ్యాన్ని ద్వేషిస్తున్న దేశాలకు అందుతున్నాయని తెలిసి, తమ దేశ పన్ను చెల్లింపుదారులు షాక్‌కు గురయ్యారని నిక్కీ తెలిపారు.
Tags :