వారిద్దరూ 10 లక్షల కోట్ల డాలర్ల రుణభారం : నిక్కీ హెలీ

రిపబ్లికన్ పార్టీ తరపున గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన జార్జ్ బుష్, డొనాల్డ్ ట్రంప్‌ల పై భారత సంతతి నేత నిక్కీ హెలీ విమర్శలు గుప్పించారు. వారిద్దరూ కలిసి దేశంపై 10 లక్షల కోట్ల డాలర్ల రుణభారం మోపారని ఆరోపించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (డెమోక్రటిక్ పార్టీ) వల్ల రాబోయే పదేళ్లలో మరో 20 లక్షల కోట్ల డాలర్ల భారం పడనుందని అంచనా వేశారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో దిగేందుకు హేలి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
Tags :