ఇన్నేళ్లకు సెట్స్‌పైకి వెళ్లనున్న డైరెక్టర్

భీష్మ సినిమా తర్వాత వెంకీ కుడుముల నుంచి మరో సినిమా వచ్చింది లేదు. గతేడాది మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్న వెంకీకి ఆ ఆనందం ఎక్కువసేపు మిగల్లేదు. గాడ్ ఫాదర్ యావరేజ్, వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ రిజల్ట్స్ లేక ఆఖరి నెరేషన్‌తో చిరూని మెప్పించలేకపోయాడో తెలిదు కానీ మొత్తానికి సినిమా అయితే క్యాన్సిల్ అయిపోయింది.
భీష్మ లాంటి సంచలన విజయం సాధించాక కూడా ఈ పరిస్థితి రావడం ఎవరూ ఊహించలేదు. దీంతో వెంకీకి బాగా గ్యాప్ వచ్చింది. దీంతో ముచ్చటగా రెండోసారి మళ్లీ నితిన్‌తోనే జట్టుకట్టబోతున్నాడు వెంకీ. కాకపోతే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ మారింది. మైత్రి మూవీ మేకర్స్ ఈసారి రంగంలోకి దిగనుందని తెలుస్తుంది.
ఈ సినిమాకు బడ్జెట్ కూడా భారీగా పెట్టనున్నట్లు సమాచారం. ఎప్పుడూ కామెడీ ఎంటర్‌టైనర్ హ్యాండిల్ చేయడంలో మంచి నైపుణ్యం ఉన్న వెంకీ ఈసారి యాక్షన్ జోలికి వెళ్లనున్నాడట. ప్రస్తుతం నితిన్, వక్కంతం వంశీ సినిమాలో బిజీగా ఉన్నాడు. పుష్ప, దసరా మాదిరి ఊర మాస్ బ్యాక్ డ్రాప్‌లో ఇది రూపొందుతోందని టాక్ నడుస్తోంది. వక్కంతం వంశీ సినిమా పూర్తి కావడానికి కాస్త టైమ్ పట్టనుంది.
కారణాలేమైనా సరే ఇలా యంగ్ డైరెక్టర్లకు ఇంతింత గ్యాప్ రావడంతో ఎంతో విలువైన టైమ్ వేస్ట్ అవుతోంది. సక్సెస్ ట్రాక్ మీద ఉండి కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ రావడం ఎంతో దురదృష్టకరం. చిరూ సినిమా ఓకే అయి ఉంటే భోళా శంకర్ తర్వాత ఈ సినిమా ఉండేది. కానీ ఈ సినిమా ఆగిపోవడం వల్ల వెంకీకి చాలానే గ్యాప్ వచ్చింది.