అదొక్కటే నా డ్రీమ్.. తద్వారా దేశానికి

అదొక్కటే నా డ్రీమ్.. తద్వారా దేశానికి

తెలంగాణలోని ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ బహిరంగ సభ జరిగిన మరుటి రోజు బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చిన కలిసి ముందుకెళ్తే చూడాలని ఉందన్నారు. అదొక్కటే తన డ్రీమ్‌ అన్నారు. పట్నాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  తనకేమీ అవసరం లేదని, కాకపోతే ప్రతిపక్ష నేతలంతా ఏకమై ముందుకు సాగితే చూడాలన్న ఒకే ఒక్క డ్రీమ్‌ ఉందన్నారు. తద్వారా దేశానికి మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు.  కేసీఆర్‌ నిర్వహించిన ఈ బహిరంగ సభ గురించి తనకు సమాచారం లేదన్నారు. తాను వేరే  పనుల్లో బిజీగా ఉన్నట్లు వెల్లడిరచారు.  ఒకవేళ సభకు కేసీఆర్‌ ఆహ్వానించినా హాజరు కాలేకపోయేవాణ్నని తెలిపారు. రాష్ట్రంలో సామధాన్‌ యాత్ర, వచ్చే నెలలో బడ్జెట్‌ సమావేశాలు తదితర కార్యక్రమాల్లో తీరికలేకుండా ఉన్నందున బీఆర్‌ఎస్‌ సభకు వెళ్లే వీలు ఉండేది కాదన్నారు. కేసీఆర్‌ సారథ్యంలోని పార్టీ చేపట్టిన బహిరంగ సభకు ఆహ్వానం అందిన నేతలు కచ్చితంగా వెళ్లి ఉంటారని నితీశ్‌ వ్యాఖ్యానించారు.

 

 

Tags :