మహాఘట్‌బంధన్‌ నేతగా నితీశ్ కుమార్ ఎన్నిక

మహాఘట్‌బంధన్‌ నేతగా నితీశ్ కుమార్ ఎన్నిక

బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్‌ శాసనసభాపక్ష నేతగా జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. వెంటనే ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌తో కలిసి నితీశ్‌కుమార్‌ గవర్నర్‌ ఫాగు చౌహాన్‌కు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు. ఇప్పటికే పాట్నాలోని రబ్రీదేవి నివససాంలో జరిగిన మహాఘట్‌బంధన్‌ సమావేశంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు నితీశ్‌కు మద్దతు తెలుపుతూ రాసిన లేఖపై సంతకాలుచేశారు. ఈ లేఖను గవర్నర్‌కు ఆర్జేడి అందజేసింది.

 

Tags :