బీహార్ సీఎం నీతిశ్ కుమార్ రాజీనామా

బీహార్ సీఎం నీతిశ్ కుమార్ రాజీనామా

బీహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్‌, ఎన్డీయేతో కూటమి బంధానికి ముగింపు పలికారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. ఈ మేరకు నేడు  గవర్నర్‌ ఫాగు చౌహాన్‌ను కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. త్వరలోనే ఆయన ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ సభ్యులందరి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేసినట్లు నితీష్‌ కుమార్‌ ప్రకటించారు. బీజేపీతో నితీష్‌ కుమార్‌ తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే.

 

Tags :