బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం

బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఫగు చౌహాన్‌ నితీశ్‌ కమార్‌తో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ప్రమాణం చేశారు. బీజేపీ, జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ) సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్‌ వామపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి తేజస్వీ సతీమణి, తల్లి రబ్దీదేవి, సోదరుడు తేజ ప్రతాప్‌ తదితరులు హాజరయ్యారు.

 

Tags :